మంచి బ్యాగ్రౌండ్‌తో గ్రాండ్‌గా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ అయినా.. ఆ తర్వాత పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు శ్రీనివాస్. రీసెంట్గా 'ఛత్రపతి' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. దాంతో మళ్లీ టాలీవుడ్లోనే ట్రై చేస్తన్నాడు బెల్లంకొండ బాబు.
‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas)ను హీరోగా లాంచ్ చేశాడు వి.వి.వినాయక్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలతోను జస్ట్ ఓకె అనిపించుకున్నాడు. అయితే ‘రాక్షసుడు’ లాంటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో రేసులో వెనకబడిపోయాడు బెల్లంకొండ. ఈ మధ్యే తనను హీరోగా లాంచ్ చేసిన వినాయక్‌తో హీందీలో గ్రాండ్‌గా లాంచ్ అవడానికి.. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను రిమేక్ చేశారు.
కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. ఛత్రపతి డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ యంగ్ హీరో కెరీర్ డైలమాలో పడిపోయింది. కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. రీసెంట్‌గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో ‘భీమ్లా నాయక్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు రంగం సిద్దం చేస్తున్నాడు.
‘రాక్షసుడు’ డైరెక్టర్ రమేశ్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ‘రుద్రాక్ష’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమా కూడా థ్రిల్లర్ జోనర్లో సాగుతుందట. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అఫీషయిల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఆగస్టు నుంచి షూటింగు మొదలవుతుందని సమాచారం.