యాంకర్ రష్మీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రష్మి చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ సమయంలో ఆమెను ఎవరూ గుర్తించలేదు. కానీ, ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ కి యాంకర్ గా మారిందో, ఆమె క్రేజ్ మారిపోయింది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటి నుంచి ఆమె కంటిన్యూస్ గా టీవీ షోలో చేస్తూనే ఉంది.
యాంకర్ రష్మీ(Anchor Rashmi) కొన్ని సినిమాలు చేసింది. కొన్ని క్లిక్ అయ్యాయి. కానీ ఆమె మాత్రం పాపులర్ హీరోయిన్ కాలేకపోయింది. తర్వాత మళ్లీ టీవీ షోలపై ఫోకస్ పెట్టింది. అయితే, తాజాగా ఆమెకు చిరంజీవి భోళా శంకర్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ భోళా శంకర్ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలున్నాయి. దీనికి తగ్గట్లుగానే.. మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ సినిమా నుండి వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు.
తాజాగా ఓ పాట విడుదల చేశారు. అందులో చిరు, తన సోదరుడు పవన్ మేనరిజమ్స్ ని ఫాలో అయ్యారు. అయితే, ఆ పాటలో చిరు సరసన రష్మి(Anchor Rashmi) నటించడం విశేషం. మొదట ఆ ఫోటోలో రష్మిని చూసి రాశీ ఖన్నా అనుకున్నారు. కానీ, తర్వాత క్లియర్ గా చూస్తే రష్మిక అనే విషయం అర్థమైంది. అది చూసి అందరూ షాకైపోయారు. రష్మికి మంచి అవకాశం వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రష్మి కేవలం ఆ పాటకు మాత్రమేనా లేక ఫుల్ మూవీలో పూర్తి రోల్ చేసిందో తెలియాల్సి ఉంది.