KNR: శంకరపట్నం మండలంలో ఓ మైనర్ బాలికకు బాల్య వివాహం చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ చెన్నూరి పద్మ ఇచ్చిన పిటిషన్ మేరకు, ముద్రవేణి సంపత్, శోభల కుమారుడు ముద్రవేణి రాజ్ కుమార్‌కు బాలికతో చట్టవిరుద్ధంగా వివాహం నిర్వహించారు. దీంతో బాలిక తల్లిదండ్రులపై, సంపత్, శోభారాజ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.