E.G: కొవ్వూరులోని మినీ బస్టాండ్ వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వై.వి. మూర్తి శనివారం తెలిపారు. ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్ ప్రాంగణంలో పూల దుకాణాలు, ఇతర వ్యాపారాల కోసం స్థలాన్ని అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.