AKP: నక్కపల్లిలో 50 పడకల సీహెచ్సీని వంద పడకలుగా అప్ గ్రేడ్ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి రూ.32.80 కోట్లు మంజూరైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. కోటవురట్ల మండలం ఇందేశమ్మ ఘాట్ రోడ్డులో కొండను తొలచి రహదారి విస్తరణకు రూ.16 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.