IPL-2026 సీజన్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ IPLకు అందుబాటులో ఉండటం లేదని అతడు స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్, ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.