ప్రకాశం: ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు జిల్లాకు మంచి పేరు తీసుకురావలన్నారు.