ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలోకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Sitakka) తల్లిదండ్రులకు పోడు భూమి పట్టాలను తహసీల్దార్ అందించారు.పోడు భూముల (Podu lands) విషయంలో అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని కనుగొంది. అర్హులైన అడవి బిడ్డలకు పోడు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అటవీ భూములపై హక్కుల కోసం ఎదురు చూస్తున్న గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ (Distribution of rails) గత నెల చివరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. తెలంగాణ(Telangana)వ్యాప్తంగా 1,15,146 మంది గిరిజనులకు 4,06,369 ఎకరాలపై హక్కు పట్టాలు అందజేయాలని నిర్ణయించారు. కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో జూన్ 30న పోడు పట్టాల కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు.అడవిని నమ్ముకొని వందల ఏండ్లుగా జీవిస్తున్న ఆదివాసీ బిడ్డలకు సీఎం అండగా నిలిచారు.