బీహార్ (Bihar) రైల్వే ప్లాట్ ఫారమ్ పై ఓ కుర్రాడి విన్యాసాలు సోషల్ మీడియాలో వైరలవుతుంది.మాన్పూర్ జంక్షన్(Manpur Junction)లో ట్రైన్ ఆగి ఉంది. ఓ యువకుడు సడెన్‌గా పిల్లిమొగ్గలు వేయడం మొదలుపెట్టాడు. అతని విన్యాసాన్ని చూస్తూ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చాలామంది చేసే విన్యాసాలు చూస్తూనే ఉన్నాం.పబ్లిక్ ప్లేస్‌లు, రైల్వే స్టేషన్లు ఎక్కడపడితే అక్కడ వీడియోలు చేస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్న వారిని చూస్తున్నాం.
ముఖ్యంగా రైల్వే స్టేషన్ల(Railway stations)లో, రైళ్లలో వీడియోలు, రీల్స్ నిషేధం అని అధికారులు మొత్తుకుంటున్న యువత చెవికెక్కడం లేదు. బీహార్ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు (Catnip) వేస్తూ ఫీట్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.యువకుడు వైరల్ అవ్వాలని విన్యాసాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. సోషల్ మీడియా(Social media)లో లైక్‌లు, షేర్ల కోసం తమ జీవితాలను పణంగా పెట్టే ఇలాంటి వారికి ఇది ఒక గుణపాఠంగా మేము ఆశిస్తున్నాము’ అనే క్యాప్షన్‌తో దీనిని షేర్ చేశారు.