Revanth Reddy: ఉచిత విద్యుత్ అంశం తెలంగాణ రాష్ట్రంలో అగ్గిరాజేసింది. అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వచ్చిన రేవంత్.. మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఉచిత విద్యుత్ అంశంపై బీఆర్ఎస్ పార్టీతో చర్చకు సిద్దం అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అని ఆరోపించారు. ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ కామెంట్లు చేశారని తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
తాను రైతు బిడ్డను అని.. పొలంలో పనిచేస్తాను అని గుర్తుచేశారు. తనతో పొలంలో మంత్రి కేటీఆర్ పనిచేయగలరా అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడిగారు. పొలంలో పనిచేసి.. ప్రజల్లోకి వచ్చానని పేర్కొన్నారు. అమెరికా నుంచి రాలేనని స్పష్టంచేశారు. తనతో పొలంలో కేటీఆర్ పనిచేయగలరా ..? అని సవాల్ విసిరారు. ఉచిత్ విద్యుత్ అంశంపై బీఆర్ఎస్ చిల్లర ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ఆనాడు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పి.. అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఉచిత విద్యుత్ ఇస్తే వైర్లపై బట్టలు ఆరేసుకోవాలని టీడీపీ నేతలు చెప్పినప్పటికీ.. జనం విశ్వసించలేదని తెలిపారు.
బషీర్ బాగ్‌లో తుపాకీ తూటాలు పేల్చిన సమయంలో టీడీపీ కీలక పదవీలో కేసీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఉచిత కరెంట్‌కు వ్యతిరేకంగా టీడీపీ చేత స్లోగన్ రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్, వామపక్షాలు దానిని వ్యతిరేకించామని వివరించారు.