శ్రీచైతన్య (Sri Chaitanya) విద్యా సంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు (BS Rao) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల బాత్రూంలో జారి కిందపడటంతో హైదరాబాద్లో ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు మరణించారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడకు తరలిస్తున్నారు. ఆయన స్వస్థలం బెజవాడ అనే సంగతి తెలిసిందే. శ్రీ చైతన్య విద్యా సంస్థలను బీఎస్ రావు స్థాపించారు. నారాయణ విద్యాసంస్థలతో పాటు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ పోటీ పడుతుంది. ఐఐటీ, నీట్ ఇతర ప్రతిష్టాత్మక వర్సిటీ, ఎంట్రెన్స్ ఎగ్జామ్లలో శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంటారు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు.
మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.