BDK: పాల్వంచలోని శ్రీనివాస కాలనీకి వెళ్లే రోడ్డుపై నెలలుగా గుంతలు ఉన్నాయి. ప్రతి రోజు ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు కనిపించలేదు. అయితే రేపు మంత్రి తుమ్మల పర్యటన ఉండటంతో గుంతలను అధికారులు పూడ్చడంపై “మా బతుకులు అంత విలువలేనివేనా”..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.