AP Health Minister Vidu Dala Rajani is sick.. is it true..?
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలలో నూతన భవనాలతో పాటు పలు విభాగాలను ఆమె ప్రారంభించాడానికి వచ్చారు. ఈ కార్యక్రమం కోసం ముందురోజే పల్నాడు లోని చిలకలూరు పేట నుంచి జగ్గయ్యపేటలోని తన బంధువు, స్థానిక ఎస్జీఎస్ కళాశాల ఏవో కే. సత్యనారాయణ రావు ఇంటికి వచ్చారు. అనంతరం సమావేశంలో పాల్గోన్న ఆమెకు పలుమార్లు అసౌకర్యానికి గురయ్యారు.
మంత్రి రజిని సభలో కాసేపు మాట్లాడి కూర్చుండిపోయారు. సభ జరుగుతున్న సమయంలో మంత్రి పరిస్థితిని గమనించిన ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారిణి సుహసిని ఆమెకు ORSను అందించారు. ఆ తర్వాత కార్యక్రమం జరుగుతుండగానే ఆమె వెనుదిరిగి తన బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. డాక్టర్ సౌజన్య, ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో మంత్రికి సెలైన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. అలసట నీరసం కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న మంత్రిని ప్రభుత్వ విప్ సామనేని ఉదయభాను ఇతర నేతలు పరామర్శించారు.