GDWL: చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు సకాలంలో టీకాలు వేయించాలని హెల్త్ సూపర్వైజర్ సుబ్బలక్ష్మి సూచించారు. శనివారం గద్వాల పాత డీఎంహెచ్వో కార్యాలయంలో టీకాల కార్యక్రమం నిర్వహించారు. పుట్టినప్పటి నుంచి టీకాలు వేయించడం ద్వారా పోలియో, టీబీ, హెపటైటిస్-బి వంటి వ్యాధులను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు.