NRML: పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. శనివారం నిర్మల్ పట్టణంలోని సోమవార్ పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష గదులను పరిశీలించి విద్యార్థులకు త్రాగునీరు, బెంచీలు, లైటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూశారు.