NDL: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. గడివేములలో అన్నదాత సుఖీభవ మూడో విడత రూ.6,000 రైతుల బ్యాంక్ ఖాతాలో నేడు జమ చేశామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతలలో రూ.14 వేలే జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.