CTR: జిల్లాలో ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పరీక్షలు లేని రోజుల్లో ఆ పాఠశాలలు ఉదయం నుంచి పని చేయాలని సూచించారు.