KRNL: పెద్దకడబూరు మండలంలో ఆటో డ్రైవర్లకు SI మారుతి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై కౌన్సెలింగ్ ఇచ్చారు. ఓవర్లోడ్ చేయకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తిస్తూ భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.