NLG: త్రిపురారంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఏప్రిల్ 16 వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. పరీక్షల రోజుల్లో మండల కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లను మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని సూచించారు.