KRNL: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలోని శ్రీలక్ష్మీ మాధవుడి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ లెక్కింపు జరిగింది. గత రాత్రి ఆలయ ఈవో గుర్రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, హుండీల ద్వారా రూ. 14,61,213 ఆదాయం లభించింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం రూ.1,43,825 తగ్గింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్ఫెక్టర్ రమేష్ ఉన్నారు.