VZM: మెరకముడిదాం మండల సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు MPDO బాస్కరరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశం ఆదివారం ఏర్పాటు చేసినప్పటికీ సమావేశానికి సరిపడే సభ్యులు లేనందున వాయిదా తీర్మానాన్ని ప్రకటించామన్నారు. ఈ మేరకు ఈ మండల సర్వసభ్య సమావేశం ఈనెల 21 తేదీన MPP తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.