ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హమాలివాడలో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులను పరిశీలించారు. మున్సిపల్ ఛైర్మన్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.