GNTR: పొన్నూరులో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో అపార్ట్మెంట్ ప్రతినిధులు, హోటల్ యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. బల్క్ వేస్ట్ జనరేటర్లు చెత్తను తడి, పొడి, హానికర వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. నగర పరిశుభ్రతకు అందరూ సహకరించాలని కోరారు.