GDWL: రాజోలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్సై గోకారి తెలిపారు. పరీక్షా కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటాయని, పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.