AKP: కోటవురట్లలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఇవాళ ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో రామారావు, చీఫ్ సూపరింటెండెంట్ వరలక్ష్మి పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో 351 మంది పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామన్నారు.