TG: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ‘క్యూర్’ పరిధిలో తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతలను టాటా కన్సల్టెన్సీకి అప్పగించారు. దీంతోపాటు మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన సర్వే పనులు సైతం ప్రారంభమయ్యాయి.