బిగుతైన జీన్స్ వల్ల మహిళల జననేంద్రియాల వద్ద గాలి ఆడదు. దీనివల్ల చెమట పట్టడం, ఆ ప్రాంతం తేమగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా దురద, మంట, ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పురుషుల్లో వృషణాల చుట్టూ వేడి పెరుగుతుంది. ఇది వీర్య కణాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా, వాటి కదలికను కూడా దెబ్బతీస్తుంది.