CTR: పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌పై నమోదైన కేసును చిత్తూరు జిల్లా ఫస్ట్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. యాదమరి మండలం కాశిరాళ్ల వద్ద 2023లో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో యాదమరి పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌తో పాటు ఇతర నాయకులపై నమోదైన కేసును రద్దు చేసింది.