NZB: నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని 144 కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు సీపీ పి.సాయి చైతన్య శనివారం తెలిపారు. పరీక్షా సమయాల్లో కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.