GNTR: పొన్నూరు మున్సిపాలిటీలో పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రమేష్ బాబు వెల్లడించారు. ఆస్తి పన్ను, ఇతర బకాయిలను సకాలంలో చెల్లించేలా శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ కార్యాలయం పనిచేస్తుందని ఆయన తెలిపారు. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.