»After 5 Kg Chotu Cylinder 2 Kg Munna Cylinder Will Come In Northeast Market
Gas Cylinder:మార్కెట్లోకి రానున్న 2కేజీల మున్నా సిలిండర్.. తొలుత ఏ రాష్ట్రాల్లో అంటే ?
ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్ఫ్రా డెవలప్మెంట్పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు.
Gas Cylinder: దేశంలోని ఈశాన్య ప్రాంతంలో 5 కిలోల సిలిండర్ తర్వాత, ఇండియన్ ఆయిల్ 2 కిలోల మున్నాను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈశాన్య మార్కెట్లకు మున్నా సిలిండర్‌ను విడుదల చేసే యోచనలో ఉంది. ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్ఫ్రా డెవలప్మెంట్పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు. అస్సాంలో విలేకరుల సమావేశంలో అసోం ఆయిల్ డివిజన్ ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ జి రమేష్ మాట్లాడుతూ.. గత ఏడాది ఈశాన్య ప్రాంతంలో ‘ఛోటు’ 5 కిలోల ఎల్పిజి సిలిండర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, 2 కిలోల ‘మున్నా’ సిలిండర్‌ను కూడా ప్రవేశపెడతామని తెలిపారు.
త్రిపుర, నార్త్ గౌహతిలో త్వరలో ‘మున్నా’ బాటిలింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్లు రమేష్ తెలిపారు. ఈ తేలికపాటి LPG సిలిండర్లు స్థానిక చిరునామా రుజువు లేని పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలోని వలస జనాభా అవసరాలను తీరుస్తున్నాయి. తక్కువ వినియోగం, తక్కువ స్థలంలో వ్యాపారం చేసే వారికి ఈ సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ‘మున్నా’ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని ప్రజలకు సులభంగా తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుంది. ‘మున్నా’ కిలో ధర సాధారణ డొమెస్టిక్ సిలిండర్‌తో సమానంగా ఉంటుంది.అయితే దేశీయేతర ‘ఛోటు’ (ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి సిలిండర్) ధర కొంచెం ఎక్కువగా ఉంది. రీజియన్‌లో ‘ఛోటు’కి మంచి స్పందన వచ్చిందని, గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 60,000-65,000 యూనిట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 15,000 యూనిట్లు అమ్ముడయ్యాయని ఆయన తెలియజేశారు.