సూర్యాపేట జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరతలేదని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో గ్యాస్ సరఫరాపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మి మోసపోద్దని ఆయన సూచించారు.