CTR: కుప్పం ప్యాలెస్ రోడ్డులోని లాడ్జిలో అనంతపురం జిల్లా గుమ్మకట్ట డిప్యూటీ MPDO చంద్రశేఖర్ మృతి చెందాడు. నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ లాడ్జిలో రూమ్ తీసుకుని కొంతమందితో కలిసి మద్యం తాగినట్టు సమాచారం. లాడ్జ్ గది ముందు ఉన్న కారిడార్లో జీవచ్చవంలా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గుండెపోటుతో చంద్రశేఖర్ మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.