Increasing problem of anemia in women.. Sensational facts in research.!
ఆడవాళ్లలో రక్తహీనత(Anemia)తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రతి ఐదుగురి మహిళల్లో ఇద్దరు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది సమాజానికి ప్రమాదకరం అని అంటున్నారు. ఈ మేరకు నిపుణులు మహిళలపై జరిపిన పరిశోధనల్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో నేటి మహిళల్లో చాలామంది శరీరాల్లో ఐరన్ లోపం ఉన్నట్లు గుర్తించారు.ప్రతి నలుగురు యువతుల్లో ఒకరికి ఐరన్ లోపం ఉన్నట్లు తాజా సర్వే చెబుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఐరన్ లోపం మహిళల్లో సమస్యగా మారుతోంది. ఈ సమస్యను అంత తేలిగ్గా తీసుకోవద్దని ఇది భవిష్యత్తులో ప్రమాదకరమైన రక్తహీనతకు దారి తీస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఇటీవల ఆన్ అర్బోర్లోని మిచిగాన్ విశ్వవిద్యాలయం(University of Michigan) మెడికల్ స్కూల్ యువతుల పై ఒక పరిశోధన జరిపింది. అందులో భాగంగా 12 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల 3,500 మంది బాలికలను ఎంపిక చేసీ, నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్(National Health and Nutrition Examination) సర్వేలో భాగంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయన ఫలితాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. ఇందులో పాల్గొన్న 3,500 మంది మహిళల్లో 40% మందికి ఐరన్ లోపం ఉందని అధ్యయనంలో తేలింది. ఐరన్ అనేది మానవ శరీరంలో ఎర్రరక్త కణాల(Red blood cells)లో ఉంటుంది. ఈ రక్త కణాలు శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సీజన్ సరఫరా చేయడానికి ఐరన్ తోడ్పడుతుంది. అంతే కాకుండా ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచుతోంది. అలాగే ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోర్లు పెరగడానికి ఈ ఐరన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందో సదరు వ్యక్తి చర్మం, జుట్టు, గోర్లలో మార్పులు చూడొచ్చు.
వీటితో పాటు తలనొప్పి, అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం ఐరన్ లోపం లక్షణాలు. గోర్లు కొద్దికొద్దిగా విరిగిపోవడం, రోజంతా అధిక నిద్ర, అలసట ఉంటుంది. అలాగే ఐరన్ లోపం తరచుగా ఋతు రక్తస్రావం తక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. పిన్న వయస్సులోనే శరీరంలో ఐరన్ లోపం కలిగితే తరువాత అనేక దుష్ఫలితాలు ఏర్పడుతాయి. పుట్టబోయో బిడ్డలకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా చాలా మందిలో గర్భధారణ సమంలో ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. దీని మూలన పిండం సరిగా ఎదగదు. కొన్ని సార్లు నెలలు నిండని పిల్లలు జన్మిస్తారు. అందుకే బాడీలో ఐరన్ సమృద్ధిగా ఉందో లేదో యువతిలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు.
మరీ దీని నుంచి బయటపడడం ఎలా అంటే వేలకు సరైన ఆహారం తినడం మొదటి పని. తరువాత ఐరన్ లోపాన్ని భర్తి చేయడానికి ఎక్కువగా ఆకు కూరలు, చేపలు, మాంసం, మాంసం కాలేయం, వివిధ రకాల పప్పులు, తాజా పండ్లు, బాదం, ఎండుద్రాక్ష, ఓట్స్ మొదలైన వాటిని తరుచుగా తీసుకుంటుండాలి. అలాగే డైరీ ప్రొడక్ట్స్ అయిన టీ, కాఫీ, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలి. ఇలా చేస్తే ఐరన్ లోపాన్ని తగ్గించి అనిమియాను అరికట్టవచ్చని పరిశోధకులు తెలిపారు.