NGKL: కల్వకుర్తి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. టాస్క్ సీఓఓ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి బృందం శుక్రవారం పట్టణంలోని పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించింది. యువతకు ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇచ్చి, వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కేంద్రం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.