VSP: జీవీఎంసీలో ఆస్తి, ఖాళీ స్థలం, కుళాయి పన్నులు చెల్లించే వారి సౌలభ్యం కోసం జోనల్ కార్యాలయంలో పెందుర్తి అన్నా క్యాంటీన్ ఎదురుగా ఉన్న సౌకర్యం అదనపు కేంద్రం శని, ఆదివారాల్లో కూడా తెరిచి ఉంటుందని జోనల్ కమిషనర్ శంకరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ కౌంటర్లు పని చేస్తాయని పేర్కొన్నారు. పన్నులు చెల్లించి జీవీఎంసీ అభివృద్ధికి సహకరించాలన్నారు.