TG: రంజాన్ మాసం సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలోని ఓల్డ్ ఈద్గా మైదానంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ వేడుకల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ పాల్గొన్నారు. ముస్లిం సాంప్రదాయ బట్టల్లో పాల్గొని.. ఉపవాసాలు విరమించారు. కాగా, ఐపీఎల్ కోసం సిరాజ్ హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు.