TG: రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. 2, 3 రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.