Rahul Gandhi Meets Farmers At Various Villages Of Haryana
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జనంతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మోడీ ఇంటి పేరు విషయంలో గుజరాత్ హైకోర్టులో ఊరట లభించనప్పటికీ.. తన పర్యటనకు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. ఈ రోజు షిమ్లా వెళుతుండగా మార్గమధ్యలో హర్యానాలో ఆగారు. అదేదో టీ బ్రేక్.. స్నాక్స్ బ్రేక్ కోసం కాదు.. రైతులు పొలంలో ఉండగా వారి వద్దకు వెళ్లారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
On the way to Shimla, Congress leader Rahul Gandhi stops at Sonepat in Haryana and drives tractor in farm. He also tries his hand in rice paddy plantation. #RahulGandhipic.twitter.com/ksvSdatum5
సోనిపట్ సమీపంలో గల మదీనా గ్రామ శివారులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్ ఆగింది. ప్యాంట్ మోకాళ్ల వరకు మడిచి, పొలంలోకి దిగారు. రైతులతో మాట్లాడి.. వరి నాట్లు వేశారు. ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. గత నెలలో ట్రక్ డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు హర్యానాలో లారీ ఎక్కిన సంగతి తెలిసిందే. 100 కిలోమీటర్లు లారీలోనే ప్రయాణించారు. దాబా వద్ద ఆగి.. డ్రైవర్లతో టీ తాగి మాట్లాడారు.
It is reported that while going to Shimla Rahul Gandhi stopped at a village in sonepat & worked with farmers in a paddy field. Alas! Rahul gandhi has resigned to his fate and accepted that he has no political future. First tried his hands as a motorcycle mechanic and now a… pic.twitter.com/s8osSyKIm2
ఢిల్లీలోని బైక్ మెకానిక్ వర్క్ షాపునకు వెళ్లి.. పానా పట్టి బైక్ ఎలా రిపేర్ చేయాలో అడిగి తెలుసుకున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరింత యాక్టివ్ అయ్యారు. జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వీలు కల్పించుకొని మరీ కలుస్తున్నారు. ఈ రోజు రైతులతో ముచ్చటించారు.