KDP: రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులకు ఊరట లభించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ నెల 16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆయా సెంటర్లలో 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.