AP: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన ప్రాణ త్యాగానికి స్మరించుకుంటూ CM చంద్రబాబు అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’ పేరిట 6.8 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.