DRDO Scientist Pradeep Revealed Missile Secrets To Pakistan SPY
DRDO Scientist Pradeep: డీఆర్డీవో సైంటిస్ట్ (DRDO Scientist ) ఒకరు పాకిస్థాన్ స్పై ఏజెంట్‌కు ఆకర్షితులు అయ్యాడు. ఇద్దరూ వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకున్నారట. అట్రాక్ట్ అయిన శాస్త్రవేత్త (Scientist ) దేశ రక్షణకు సంబంధించిన సమాచారం అందజేశారు. ఆ సైంటిస్ట్‌ను గుర్తించిన యాంటీ టెర్రరింజ స్క్వాడ్ (ఏటీఎస్-ATS) పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణె డీఆర్డీవోకు చెందిన శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్తో (pradeep) పాకిస్థాన్ ఏజెంట్ జరా దాస్ గుప్తా పేరుతో చాటింగ్ చేసింది. ఇద్దరు వాయిస్ మెసేజ్, వీడియో కాల్స్ చేసుకున్నారని ఏటీఎస్ అధికారులు గుర్తించారు. మే 3వ తేదీన అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ప్రదీప్ ప్రస్తుతం జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నాడు. జరా దాస్ గుప్తు తాను సాప్ట్ వేర్ ఇంజినీర్ అని పరిచయం చేసుకుందట. వీడియోలు పంపించి ప్రదీప్‌ను అట్రాక్ట్ చేసిందని గుర్తించారు. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు వీరిద్దరూ టచ్‌లో ఉన్నారని తెలిపారు. దాస్ గుప్తా ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే పాకిస్థాన్ అని తేలింది. దీంతో ఆమె పాకిస్థాన్ స్పై అని గుర్తించారు. ఆమెకు ప్రదీప్ కీలక సమాచారం షేర్ చేశారని ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు.
బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిస్సైల్ లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్తోపాటు ఇతర సమాచారం షేర్ చేశారని ఏటీఎస్ పోలీసులు చెబుతున్నారు. మహిళా వ్యామోహంలో పడిన అతను డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారం తన మొబైల్లో స్టోర్ చేసుకుని.. జరాకు షేర్ చేశారని చార్జీషీట్లో ఏటీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఇతర డిఫెన్స్ ప్రాజెక్టుల గురించి చాట్ చేసినట్టు ప్రదీప్‌పై ఆరోపణలు వచ్చాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, డ్రోన్లు, బ్రహ్మోస్, అగ్ని మిస్సైల్ లాంచర్లు, యూసీవీ గురించి చాటింగ్ చేశాడని గుర్తించారు.