AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో స్థానిక ఓనూరు జంక్షన్ నుంచి కాలినడకన వంట్లమామిడి పంచాయతీ నందిగరువుకు చేరుకుని.. గిరిజనులతో మాటామంతీ నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఈ పర్యటనను కవర్ చేసేందుకు మీడియాకు అనుమతి లేదు. పవన్‌కు సంబంధించిన బృందమే ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేయనుంది.