TG: రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం మౌలిక వసతులు, అగ్రి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర ఉద్యాన రంగానికి.. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు ఎగుమతుల్లో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. సరఫరా, ప్యాక్ హౌస్లు, కోల్డ్ స్టోరేజీ, లాజిస్టిక్స్ మెరుగపడేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.