BDK: భద్రాచలం పట్టణంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. శుక్రవారం ఇరువురి ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై జీ. స్వప్న తెలిపారు. చిన్నపాటి కారణాలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం దురదృష్టకరమని, ఇలాంటి వివాదాలను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.