WNP: జిల్లా కేంద్రంలో కుమ్మరి శాలివాహన పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి వెంకటేశ్ ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనపర్తిలో మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.