PLD: జిల్లాలో గృహ వినియోగదారులకు అవసరమైన LPG గ్యాస్ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. కొందరు మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని సిలిండర్లను అక్రమ నిల్వలు చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.