CTR: ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలంలో రైతులతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 36,473 మంది రైతులకు సుమారు రూ.19.76 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.