WGL: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు WGL 40వ డివిజన్లోని ఎల్లమ్మ దేవాలయాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, PCC కార్యదర్శి మీసాల ప్రకాష్ సందర్శించారు. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు కేటాయించనున్నట్లు వారు వెల్లడించారు. అభివృద్ధి పనులకు అవసరమైన వివరాలు, ప్రాధాన్యతలు సేకరించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.