»Salaar Movie Is Negative Trending But The Top Place Is Different
Salaar: ట్రెండింగ్‌లో ‘సలార్’..కానీ పాజిటివ్ లో కాదు!
ఇన్నాళ్లు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ టీజర్‌ను.. నిన్న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు చూడని ప్రభాస్ మాస్ కటౌట్‌ని సలార్‌లో చూపించబోతున్నానని.. టీజర్‌తో క్లియర్ కట్‌గా చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అయినా కూడా టాప్ ట్రెండింగ్ వేరే ఉంది.
ఒక నిమిషం 46 సెకన్ల నిడివి గల సలార్(Salaar) టీజర్.. టీనూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైంది. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకుంటే ఆ పార్కులో..’ అనే డైలాగ్‌తో ప్రభాస్(prabhas)కు ఎలివేషన్ ఇచ్చాడు. దీంతో ఇది కదా మాకు కావాల్సింది.. అంటూ పండగ చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ సినిమాతో బాహుబలి తర్వాత పెరిగిపోయిన తమ దాహం తీరిపోవడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం సలార్ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎన్ని ఫ్లాట్ ఫామ్స్ ఉంటే.. అన్నింటిలోను సలార్ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. కానీ సలార్ కంటే టాప్ ప్లేస్‌లో మరో ట్రెండ్ అవుతోంది.
అది సలార్ గురించే అయినా.. #Disappointed అనే నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇందులో మొత్తం సలార్ టీజర్‌కు సంబంధించిన పోస్టులే ఉన్నాయి. సలార్ టీజర్ మొత్తంలో ఉన్న ఏకైక కంప్లైంట్.. ప్రభాస్‌ని ఫుల్లుగా చూపించలేదు.. ఎక్కువ సేపు కనిపించలేదు. కనీసం మొహం కూడా సరిగ్గా చూపించలేదని.. కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. టీజర్ రిలీజ్ చేస్తామని హైప్ ఇచ్చి.. ప్రీ టీజర్ రిలీజ్ చేశారని.. ఇది చిన్న గ్లింప్స్‌లా ఉందని.. మేకర్స్ పై కాస్త ఫైర్ అవుతున్నారు. సలార్ టీజర్‌ను కేజీఎఫ్-2(kgf2) టీజర్తోను పోల్చుతున్నారు. కేజీఎఫ్-2 టీజర్లో యశ్ కనిపించాడని, కానీ మా డార్లింగ్‌ను చూపించి చూపించకుండా డిసప్పాయింట్ చేశాడని.. ‘డిజప్పాయింట్’ అనే ట్యాగ్‌ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయినా డార్లింగ్స్.. ఇప్పుడే కదా వేట మొదలైంది. ముందు ముందు ఇంకా చాలా ఉంటది. అని ప్రశాంత్ నీల్ అనుకున్నాడో ఏమో గానీ.. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనేలా ఉండడం ఖాయమని చెప్పొచ్చు.